ఆ హీరోయిన్ ఏడాది ఏం చేసిందంటే?

102
- Advertisement -

ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో తన నటన తో టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపుని సంపాదించుకున్న నభా నటేష్ ఇటీవల సినిమాలకు బ్రేక్ తీసుకుంది.

వెంట వెంటనే చిత్రాలు చేస్తున్న సమయంలో తను బ్రేక్ తీసుకోవడానికి కారణం లేకపోలేదు. ఆ విషయాన్నే బయటపెడుతూ… తాజాగా నభా పోస్ట్ పెట్టింది.

“గడిచిన సంవత్సరం చాలా కష్టంగా సాగిపోయింది, నాకొక ప్రమాదం జరిగింది, ఆ ప్రమాదంలో నా ఎడమ భుజానికి తీవ్ర గాయమై క్లిష్టమైన సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది.” అని తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా తెలిపింది.

చికిత్సలో భాగంగా తను తీవ్రమైన శారీరక, మానసిక బాధని ఎదురుకున్నట్టు చెబుతూ తను మళ్ళీ నటించడం మొదలుపెడతానని, తిరిగి చిత్రాలు చేస్తానని చెప్పుకొచ్చింది యంగ్ బ్యూటీ.

- Advertisement -