యూత్ ఇన్‌ పాలిటిక్స్‌…భవిష్యత్ మీదే

20
- Advertisement -

యూత్ ఇన్ పాలిటిక్స్…ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం 76 ఏళ్ల స్వాతంత్ర్య ఫలాలను అనుభవిస్తున్నాం..కానీ యువత ఎక్కడున్నారంటే ప్రశ్నార్థకంగానే మారింది.మన దేశంలో చాలా మంది యువ రాజకీయ నాయకులు, రాజకీయ ఆధిపత్యం ఉన్న కుటుంబాలకు చెందినవారు. కుటుంబ సభ్యులు రాజకీయాల్లో ఉంటే లేదా వారి మద్దతుంటే తప్ప ఆయా పార్టీల టికెట్లు పొందడం కష్టం. అందుకే ఎన్నికల్లో పోటీ చేయడం మన దేశ యువతకు ఒక ముఖ్యమైన సవాలుగా మారింది.

అయితే వారసత్వపరంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఓ ఫ్లాట్ ఫామ్‌లాగా ఉపయోగపడినా తర్వాత వారి టాలెంట్‌ని ప్రూవ్ చేసుకోకపోతే వారికి రాజకీయ భవిష్యత్ ఉండదు. అలా ప్రజామోదం లేని యువ నాయకులు ఇప్పటికి రాజకీయ చదరంగంలో కొట్టుమిట్టాడుతుండగా మరికొంతమంది మాత్రం పాలనలో తమదైన సంస్కరణలతో ఆకట్టుకుంటున్నారు. అయితే ఇలాంటి వారి పదుల సంఖ్యలోనే ఉన్నారు.

కానీ మన దేశానికి రాజకీయాల్లో యువత భాగస్వామ్యం అవసరం. దేశంలో వేల సంఖ్యలో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో 2 వేలకు పైగా రాజకీయ పార్టీలుండగా పెద్ద పార్టీల సంఖ్య 150కి పైగా ఉన్నాయి. కానీ ఈ పార్టీలలో ఎంతమంది యువతీ ,యువకులు ఉన్నారు.ఒకవేళ ఉంటే ఆ పార్టీలలో ఉన్నవారికి ఎంత వరకు ఉన్నత స్థాయి అవకాశాలు ఇస్తున్నారు… వారి ఆలోచనలకు ఎంత వరకు విలువలు ఇస్తున్నారు అనేది ప్రశ్నార్ధకమే. సహజంగా అన్ని రకాల రాజకీయ పార్టీలకు విద్యార్థి, యువజన సంఘాలు ఉన్నప్పటికీ… ఆ సంఘాలు ఎలాంటి ఆలోచనతో నడుస్తున్నాయి అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి….

Also Read:ఇదేనా బీజేపీ సమన్యాయం?

దేశంలో రోజు రోజుకు నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరుగుతోంది. ఈ సమస్యలను తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. కేవలం దేశ అభివృద్ధి పేరుతో  చేసే హంగామా తప్ప మరేం మార్పు లేదు. భారత దేశం జనాభాలో 65% నుండి 70% వరకు యువతదే. అంటే వచ్చే రోజులలో  నిరుద్యోగ సమస్య తీవ్రత ఎంతగా ఉంటుందో మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

దేశంలో యువతీ ,యువకుల కోసం ఇప్పటి వరకు ఎన్ని ప్రత్యేక చట్టాలు,ఎన్ని ప్రభుత్వ పథకాలు ఏర్పాటు చేస్తాయి ? ఒకవేళ ఏర్పాటు చేస్తే ఆ చట్టాలు, ఆ పథకాలు ఎంత మంది యువతకు చేరాయని అందరం ప్రశ్నించుకోవాలి. ఒకవేళ ప్రశ్నిస్తే కులాల, మతాల పేరుతో కొన్ని రకాల పథకాలను ఏర్పాటు చేసి, అవే పథకాలు యువత కోసం అని తప్పుడు ప్రచారం చేస్తున్నాయి.

ప్రస్తుత కాలంలో యువతరానికి రాజకీయాలు అంటే చెడు అభిప్రాయం ఉన్నప్పటికీ, కొంతమందిలో  నేటి రాజకీయాలను మార్చాలి అనే ఆలోచన బలంగా ఉంది. కానీ సరియైన అవకాశాలు లేక, తోడ్పాటు లేకపోవడం, వారికి పార్టీల పెద్దలు నమ్మకం, భరోసా ఇవ్వక పోవడం వల్ల వెనుకడుగు వేస్తున్నారు. అందుకే నేటి యువతరం రాజకీయాలలోకి వచ్చి  దేశాన్ని మీ ఆలోచనలతో అభివృద్ధి చేయాలి…అప్పుడే  మరింత మార్పు వచ్చి సరికొత్త ఆవిష్కరణలకు ముందడుగు పడే అవకాశం ఉంది.

Also Read:నగదు రహిత భారతదేశం…

- Advertisement -