పవన్ సినిమా అంటేనే చాలా క్రేజ్. పవన్ సినిమా రిలీజ్ అయిందంటే..ఆ వారంలో రిలీజ్ కావాల్సిన సినిమాలన్నీ పోస్ట్‌పోన్ చేసుకోవాల్సిందే. సినిమా టాక్ ఎలా ఉన్నా.. కలెక్షన్ల పరంగా పవన్ పవర్ చూపించడం ఖాయం. అయితే పవన్ కలెక్షన్ల పవర్ ని తగ్గించడాని ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎందుకంటే కాటమరాయుడినే కంగారు పెట్టించడానికి మిగిలిన సినిమాలు రెడీ అయిపోతున్నాయి.
మరో సూపర్ హిట్ కోసం పూరి ఇప్పుడు చాలా కసిగా ఉన్నాడు. అందుకే రోగ్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కానంటున్నాడు పూరి. నిజానికి పూరి దర్శకత్వం వహించిన రోగ్ సినిమా మార్చి 31న విడుదల కావాల్సి ఉంది. కానీ దాన్ని రెండురోజుల ముందే రిలీజ్ చెయ్యడానికి డిసైడయ్యాడు పూరి. అంటే ఉగాది కానుకగా ప్రేక్షకులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చేయాలని పూరి ఆలోచన.
అయితే.. ఈ నెల 24న రిలీజ్ అయిన కాటమరాయుడు కి కలెక్షన్లలో ఇక డోకా లేదు అనుకున్నసమయలో పూరి సినిమా కలెక్షన్ల షేర్ ని పంచుకునేందుకు రెడీ అవుతోంది. అయితే ఇప్పుడు కాటమరాయుడుకి ధీటుగా మరో సినిమా కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఆ సినిమానే గురు. విక్టరీ వెంకటేష్ నటించిన ఈ సినిమా కూడా మార్చి 31కి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
మామూలుగా ఒక భారీ చిత్రం రిలీజ్ అయితే దానితో వీలయినంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చూస్తారు.కానీ పూరి, వెంకీ అస్సలు ఆగడం లేదని అర్థమైపోయింది. అందుకే కాటమరాయుడిని లెక్కచేయకుండా సినిమా పరంగా ఎవరి సత్తా ఏంటో చూపించుకునేందుకు మిగిలిన సినిమాలు
కాస్తంత కూడా వెనక్కి తగ్గడంలేదనే చెప్పాలి. అసలు కాటమరాయుడు ఉన్నాడన్న సంగతి తెలిసి కూడా ఈ సినిమాలు బరిలోకి దిగుతున్నాయంటే..సంక్రాంతికి మూడు సినిమాలు రిలీజ్ అయితే దేని మెరిట్‌కి తగ్గట్టు అది ఆడేసే సరికి ఎవరి మార్కెట్ వారికి వుంటుందని భావిస్తున్నట్టున్నారు. ఓపెన్ గ్రౌండ్‌లో ఢోకా లేదని అనుకున్న కాటమరాయుడు ఈ కాంపిటీషన్‌లో సేఫ్ అవ్వాలంటే టాక్ బాగుండాలి మరి. చూద్దాం ఎవరి సినిమా టాక్ ఏ రేంజ్‌లో ఉంటుందో.