తల్లీకొడుకుల హత్య..భర్తపై అనుమానం..!

130
Husband could have done this!

అమెరికాలో హత్యకు గురైన నర్రా హనుమంతరావు భార్య, కుమారుడి కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. తన కుమార్తె, మనవడిని హనుమంతరావే హత్య చేశాడని శశికళ తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, కృష్ణకుమారి ఆరోపించారు. ఇదే విషయాన్ని అమెరికా అధికారులకు తాము ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు.

హనుమంతరావుకు అమెరికాలో వివాహేతర సంబంధాలున్నాయని, తనను వేధిస్తున్నట్టు తన కుమార్తె చెబుతుండేదని ఆయన తెలిపారు. హనుమంతరావు వేధింపులపై తన వియ్యంకుడికి ఎన్నో మార్లు చెప్పినా, వారు పట్టించుకోలేదని చెప్పుకొచ్చారు. శశికళతో పాటు అనీష్ ను తానే చంపి ఇప్పుడిలా నాటకం ఆడుతున్నాడని వెంకటేశ్వరరావు ఆరోపించారు.

Husband could have done this!

నర్రా హనుమంతరావు గత 12ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నారు. శశికళ కూడా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు.  వీరికి 14 ఏళ్ల క్రితం వివాహమైంది. అమెరికాలో తొమ్మిదేళ్లుగా నివసిస్తున్నారు. హనుమంతరావు ఓ కంపెనీలో అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తుండగా.. శశికళ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నారు. శశికళ బుధవారం సాయంత్రం  బాబును స్కూల్‌ నుంచి తీసుకొచ్చారు. అయితే, సాయంత్రం ఏడు గంటలకు హనుమంతరావు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి భార్య, కుమారుడు రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉన్నారు. వారిని గొంతు కోసి హత్య చేశారు.

అయితే తొలుత  దోపిడీకి వచ్చిన దుండగులే ఈ దాడికి పాల్పడ్డారా? లేక జాత్యహంకారా దాడికి పాల్పడ్డారా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, తాజాగా శశికళ తల్లిదండ్రులు హనుమంతరావుపై అనుమానం వ్యక్తం చేయడంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది.