జీహెచ్‌ఎంసీ ఎన్నికల పూర్తి సమాచారం..

193
- Advertisement -

డిసెంబర్‌ 1న హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూడవచ్చు.

ఎన్నికలు జరిగే తేదీ?
డిసెంబర్ 1

పోలింగ్ టైమ్?
ఉదయం 7 గంటల నుంచి మొదలు. సాయంత్రం 6 గంటలకు ముగింపు.

పోలింగ్ కేంద్రం దగ్గర ఖాళీగా నిల్చోవచ్చా?
100 మీటర్ల అవతల ఉండొచ్చు.

మొత్తం వార్డులు ఎన్ని?
150 వార్డులు

ఎంత మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు?
వివిధ పార్టీలకు చెందిన మొత్తం 1,893 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా వీటిలో 68 నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించింది. దీంతో బీజేపీ 539, టీఆర్ఎస్ 527, కాంగ్రెస్‌ 348, టీడీపీ 202, ఎంఐఎం 72, సీపీఐ 22, సీపీఎం 19, గుర్తింపు పొందిన ఇతర పార్టీల నుంచి 143, స్వతంత్ర అభ్యర్థులు 613 నామినేషన్లు సవ్యంగా ఉన్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.

ఓట్ల లెక్కింపు ఎప్పుడు?
డిసెంబర్ 4న. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు.

ఎన్నికలు ఎలా జరుగుతాయి?
బ్యాలెట్ పద్ధతిలో.

హైదరాబాద్ లిమిట్స్‌లో పోలింగ్ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి?
మొత్తం పోలింగ్ కేంద్రాలు 4936. వాటిలో 62 సైబరాబాద్ పరిధిలో ఉండగా… 105 సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఉన్నాయి. అవి కాకుండా 4979 హైదరాబాద్ లిమిట్స్‌లో ఉన్నట్లు లెక్క.

గ్రేటర్ పరిధిలో పోలింగ్ కేంద్రాలు ఎన్ని?
9,248 పోలింగ్ కేంద్రాలు (1,439 సున్నితమైన, 1,004 సమస్యాత్మక, 257 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు.)

మొత్తం పోలింగ్ లొకేషన్లు ఎన్ని?
1632

సున్నితమైన (సెన్సిటివ్) ప్రాంతాలెన్ని?
601 పోలింగ్ లొకేషన్లు, 1704 పోలింగ్ కేంద్రాలు సున్నితమైనవి.

హైపర్ సెన్సిటివ్ (అతి సున్నిత) ప్రదేశాలెన్ని?
307 పోలింగ్ లొకేషన్లు, 1085 పోలింగ్ కేంద్రాలు అతి సున్నితమైనవి.

హైదరాబాద్ లిమిట్స్‌లో ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయి?
15 ఉన్నాయి.

ఎంతమంది రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నారు?
మొత్తం 2785 మంది. వారిలో రౌడీలు 1167, అనుమానితులు 1014, ఇతరులు 604 మంది.

ఎన్ని ఆయుధాల్ని డిపాజిట్, సీజ్ చేశారు?
3744 ఆయుధాల్ని డిపాజిట్, 2 కత్తులను సీజ్ చేశారు.

ఎన్ని షీ టీమ్స్ రంగంలోకి దిగాయి?
6 షీ టీమ్స్

ఇప్పటివరకూ ఎంత క్యాష్ సీజ్ చేశారు?
మొత్తం రూ.1,40,87,450
80 గ్రాముల బరువైన డ్రగ్స్. వాటి విలువ రూ.10,00,000
గంజాయి 2.1 కేజీలు. విలువ రూ.15,500
IMF లిక్కర్ 59.135 లీటర్లు. విలువ రూ.25,000

ఎన్నికల కోడ్ ఉల్లంఘనల్లో ఎన్ని కేసులు నమోదుచేశారు?
FIRలు 19
చిన్నకేసులు 3
GD ఎంట్రీ 23

- Advertisement -