ఆపరేషన్ సిందూర్…ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్‌గా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఓ మాటలో చెప్పాలంటే ఆపరేషన్ సిందూర్ పేరు తారకమంత్రంలా వినిపిస్తోంది. కోసం 30 మంది పోటీ!
మహిళలకు సిందూరం ఎంతో పవిత్రం కనుక దానిని దూరం చేసినందుకు ప్రతీకారం తీర్చుకుంది. ఈ నేపథ్యంలో భారత సైన్యం వెంటే తామంతా అని రాజకీయాలకు అతీతంగా అంతా మద్దతిస్తున్నారు.
భారతీయులంతా సైన్యం వెంటే ఉన్నామని నినదిస్తుండగా పుట్టిన బిడ్డలకు సైతం ఇదే పేరును పెడుతూ దేశభక్తిని చాటుతున్నారు. సిందూరు , సిందూరా పేర్లను తమకు పుట్టిన బిడ్డలకు పెడుతున్నారు తల్లిదండ్రులు. ఆడబిడ్డలైతే సిందూరు, మగబిడ్డలైతే సిందూర్ పేర్లు పెడుతున్నారు.
అంతేగాదు సినీ పరిశ్రమలో సైతం ఆపరేషన్ సిందూర్‌కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఆపరేషన్ సిందూర్ , మిషన్ సిందూర్ , సిందూర్.. ద రివెంజ్ …ఇలా సిందూర్ అనే పదం వచ్చేలా రకరకాల టైటిల్స్‌తో రెండు రోజుల్లో 30 మంది నిర్మాతలు దరఖాస్తు చేసుకోవడం విశేషం.
Also Read:మంచు మనోజ్…దూకుడు!

