సత్యదేవ్ ఇరగదీశాడు.. ‘తిమ్మరుసు’ వీడియో సాంగ్..

20
Satya Dev

టాలెంటడ్‌ హీరో సత్యదేవ్ తిమ్మరుసు టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాతో శరణ్ కొప్పిశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. టైటిల్‌కు తగ్గట్టే ఎంపిక చేసుకున్న పాత్ర విధానం ఆకర్షణీయంగా తీర్చిదిద్దారని ఇప్పటికే రిలీజైన పోస్టర్లు టీజర్లు నిరూపించాయి. జూలై 30న థియేట్రికల్‌గా విడుదలకు సిద్ధమవుతున్న ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ వైరల్‌గా మారుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి స్టైలిష్ వీడియో సాంగ్ రిలీజైంది.

హీరోయిన్ ‘సమంత’ అక్కినేని చేతుల మీదుగా ఈ టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేయించారు. ప్రధానమైన పాత్రలపై చిత్రీకరించిన టైటిల్ సాంగ్ ద్వారా సత్యదేవ్ పాత్ర తీరుతెన్నులను చెప్పే ప్రయత్నం చేశారు. రూపాయి లాభం రాకపోయినా, ఆయన సత్యాన్వేషణ సాగుతూనే ఉందనే అర్థంలో ఈ పాట నడుస్తోంది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించాడు.

The Thimmarusu Video Song (4K) | Satyadev | Sricharan Pakala | Priyanka | Sharan Koppisetty