రేవణ్ణ కోసం రెండో లుకౌట్ నోటీస్..

16
- Advertisement -

‘అశ్లీల వీడియోల’ కేసులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఈరోజు కర్ణాటకలోని హాసన్‌లోని జనతాదళ్ (సెక్యులర్) నాయకుడు ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి చేరుకుంది.ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణపై రెండో లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశామని మంత్రి పరమేశ్వర తెలిపారు.

హ‌స‌న్ ఎంపీ ప్ర‌జ్వ‌ల్‌, హోలెన‌ర‌సిపుర్ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవ‌ణ్ణ‌పై న‌మోదు అయిన లైంగిక వేధింపుల కేసును ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం విచారిస్తుందని వెల్లడించారు. శుక్ర‌వారం మ‌రో మ‌హిళ కూడా ఫిర్యాదు చేయ‌డంతో .. ఆ ఇద్ద‌రిపై ఐపీసీ సెక్ష‌న్ 376 కింద రేప్ కేసును బుక్ చేశారు.

ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ అశ్లీల వీడియో కేసులోని బాధిత మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కర్ణాటక సీఎం సిద్దరామయ్యను కోరారు రాహుల్ గాంధీ. ఈ మేరకు లేఖ రాసిన రాహుల్.. హేయ‌మైన చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిన వ్య‌క్త‌ల‌ను శిక్షించాల‌ని కోరారు.

- Advertisement -