కొవిడ్ సెకండ్ వేవ్‌తో దేశం చిగురుటాకులా వణికిపోతోంది. ఈ నేపథ్యంలో మరో కొత్త వైరస్ బయటపడింది. మూడుసార్లు ఉత్పరివర్తనం చెందిన వైరస్ (ట్రిపుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్) వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తున్నది. ఈ కొత్త రకం స్ట్రెయిన్‌ను నాలుగు రాష్ర్టాలు మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్‌లో తాజాగా గుర్తించినట్టు నిపుణులు తెలిపారు.
దేశంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తుండటంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది ప్రభుత్వం. మే 1 వ తేదీ నుంచి దేశంలో 18 ఏళ్ళు నిండిన వారికి వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. దీంతో అనేక రాష్ట్రాలు తమ రాష్ట్రంలోని యువత అందరికి వ్యాక్సిన్ ఫ్రీ గా అందించేందుకు సిద్ధం అవుతున్నాయి.
బీహార్, తమిళనాడు, ఢిల్లీ ,ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, త్రిపుర, అస్సాం, కేరళ రాష్ట్రాలు ఫ్రీ వ్యాక్సినేషన్ ను ప్రకటించాయి. మరికొన్ని రాష్ట్రాలు కూడా తమ రాష్ట్రంలోని యువతకు ఫ్రీ వ్యాక్సిన్ ను ప్రకటించే అవకాశం ఉంది.