మే 1 నుండి అందరికీ కరోనా వ్యాక్సిన్…

35
vaccine

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృత రూపం దాల్చుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుండి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబ‌డిన వారంద‌రికీ కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. కొవిడ్ సెకండ్ వేవ్ అడ్డూ అదుపూ లేకుండా విజృంభిస్తున్న త‌రుణంలో సోమ‌వారం ప్ర‌ధాని నరేంద్ర మోదీ వ‌రుస స‌మావేశాల్లో పాల్గొన్నారు. ఈ స‌మావేశాల్లోనే 18 ఏళ్ల పైబ‌డిన అంద‌రికీ వ్యాక్సిన్ ఇవ్వాల‌న్న నిర్ణ‌యం తీసుకున్నారు.