కరోనా బాధితులకు ఉచితంగా ఇంటికే భోజనం..

52
swathi lakra

కరోనా బాధితులకు ఉచితంగా ఇంటికే భోజనం అందించే సరి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ పోలీస్ శాఖ. సేవ ఆహార్ పేరుతో నేటి నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కుటుంబాలలో అందరూ కరోనా భారిన పడ్డారని…వాళ్ళకోసం ఇంటికే బొజనం పంపుతామని పోలీస్ శాఖ తెలిపింది.

వివిధ స్వచ్చంద సంస్థల భాగస్వామ్యంతో పాటు…స్విగ్గి.. జోమాటో సంస్థల భాగస్వామ్యంతో పౌష్ఠిక ఆహారం ఇంటికే పంపిస్తామని తెలిపారు అడిషనల్ డీజీ స్వాతి లక్రా. సేవా ఆహార్ పేరుతో పోలీస్ శాఖ సరి కొత్త కార్యక్రమం …..రోజుకు రెండు వేల మంది బాధిత కుటుంబాలకు ఫ్రీ ఫుడ్ కోసం వాట్సప్ నంబర్ ఏర్పాటు చేశామన్నారు. సిటీ లో ఎక్కడికైనా భోజనం సప్లయ్ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు.