కర్ణాటక ఎన్నికల ప్రచారం తారాస్ధాయికి చేరుకుంది. ప్రధాన పార్టీల నేతలంతా ఎన్నికల ప్రచారంలో తలమునలవుతుండగా తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్, నిరుద్యోగ భృతి అందిస్తామని ప్రకటించారు.
కోలార్ ర్యాలీలో పాల్గొన్న రాహుల్ ఓటర్లపై వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్‌తో పాటు నిరుద్యోగ యువతకు రెండేండ్ల పాటు నెలకు రూ. 3000 భృతి అందచేస్తామని హామీ ఇచ్చారు. అవినీతి బీజేపీ సర్కార్‌ను గద్దె దింపాలని ఓటర్లకు పిలుపు ఇచ్చారు.
ఇక కనకపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సోమవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నట్టు కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ వెల్లడించారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం 130 స్ధానాల్లో విజయం సాధిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం వీరప్ప మొయిలీ ధీమా వ్యక్తం చేశారు. మే 10న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా 13న ఫలితాలు వెల్లడికానున్నాయి.
ఇవి కూడా చదవండి..