జియోకి షాకిచ్చిన ట్రాయ్‌…

228
- Advertisement -

ఉచిత కాల్స్,ఫ్రీ ఇంటర్నెట్‌ అంటూ మార్కెట్‌ను షేక్ చేసిన రిలయన్స్ జియోకి టెలికాం రెగ్యులేటరీ సంస్థ(ట్రాయ్)షాకిచ్చింది. రెగ్యులేటరీకి సమర్పించిన నివేదికలో వాయిస్ టారిఫ్ ప్లాన్ నిమిషానికి 1.20 పైసలుండగా… కస్టమర్లకు ఉచిత వాయిస్ కాల్స్ ఏ లెక్కన అందిస్తున్నారో చెప్పాలని వివరణ కోరింది.

కాల్ ప్లాన్ కింద రెగ్యులేటరీ ఫైలింగ్లో సెకనుకు 2 పైసలు చార్జ్ చేస్తామని రిలయన్స్ జియో తెలిపింది. అంటే నిమిషానికి 1.20 పైసలన్నమాట. సిమ్ కార్డ్ బ్రోచర్స్పైనే కూడా కస్టమర్లకు ఇదే కనిపిస్తుంది. అయితే ఉచిత కాల్స్ ప్రకటనకు, రెగ్యులేటరీ సమర్పణకు టారిఫ్ ప్లాన్స్లో తేడాపై రిలయన్స్ జియో స్పందించడంలేదు. దీనిపై కంపెనీ దగ్గర ఎలాంటి సమాధానం లేదని పలు టెలికాం కంపెనీలు ఆరోపిస్తున్నాయి.

Reliance Jio

2004 టెలికం రెగ్యులేటరీ టారిఫ్ ప్లాన్ ను రిలయెన్స్ జియో ఉల్లంఘిస్తుందని ఇతర టెలికాం కంపెనీలు ఆరోపిస్తున్నాయి.. ఇంటర్‑కనెక్ట్ యూజర్ చార్జీల(ఐయూసీ) కంటే తక్కువగా టారిఫ్ ఉండటానికి ఏ కంపెనీ ఒప్పుకోదు. ప్రస్తుతం ఐయూసీ నిమిషానికి 14 పైసలుగా వసూలు చేస్తోంది ట్రాయ్. రెగ్యులేటరీ నియమ నిబంధనలకు విరుద్దంగా అన్నీ ఫ్రీ అని చెప్పి రిలయెన్స్ కస్టమర్లను మోసం చేస్తోందని టెలికం కంపెనీలు విమర్శిస్తున్నాయి.

jio

మరోవైపు ఫ్రీ కాల్స్ పై వివరణ కోరిన ట్రాయ్ తో జియో ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. ఫ్రీ కాల్స్ ఇవ్వటంపై వివరణ ఇస్తున్నారు. త్వరలోనే అన్నింటికీ సమాధానం వస్తుందని రిలయన్స్ చెబుతోంది.

- Advertisement -