పవన్‌తో నయన్…

602
Nayanthara tipped to play Pawan Kalyan’s leading lady
Nayanthara tipped to play Pawan Kalyan’s leading lady
- Advertisement -

టాలీవుడ్‌లో మూప్పై ఏళ్లు దాటిన హీరోయిన్లకు డిమాండ్‌ తగ్గిపోతుండగా నయనతార మాత్రం తన డిమాండ్‌ను పెంచుకుంటోంది. తెలుగులో బాబు బంగారం, తమిళంలో ఇరుముగన్ సినిమాలతో మాంచి హిట్ కొట్టేసిన నయనతార ప్రస్తుతం భారీ ఆఫర్లను కైవసం చేసుకుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా హీరోలతో నటించేసే నయనతార గ్లామర్ ఫేడవుట్ కాకముందే.. తతనలో గ్లామర్ తగ్గకుండా ఉండేందుకు హెవీ వర్కవుట్స్ చేస్తోందట. అందాన్ని పెంచుకునే దిశగా డైట్ ఫాలో కావడమే కాకుండా ఎక్సర్‌సైజ్, యోగా వంటివి చేస్తూ.. శరీరాకృతిలో తేడా రాకూడదని భావిస్తోంది.
Nayanthara-Latest-Hot-Unseen-Photos-Nayanthara-Latest-Hot-Cleavage-Show
బాబు బంగారం తరువాత ఏ సినిమాకు కూడా సైన్‌ చేయని నయనతార పవన్‌కల్యాణ్ సరసన కథానాయికగా నటించనుందని తాజా సమాచారం. విజయదశమి రోజున పవన్ కొత్త సినిమాకు పూజా కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పవన్‌కల్యాణ్‌ హీరోగా శ్రీ సాయిరాం క్రియేషన్స్‌ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఆర్‌.టి.నేసన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌.ఐశ్వర్య నిర్మాత. ఎ.ఎం.రత్నం సమర్పిస్తున్నారు. ఇందులో పవన్‌.. ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నట్లు సమాచారం. అందులో ఒకరిగా నయనతారను ఎంచుకున్నారట. ఈ విషయమై నయనతారని మేకర్స్ సంప్రదించడం, ఆమె దాదాపుగా ఓకే చేసినట్టు కోలీవుడ్ సమాచారం. ప్రస్తుతం నయనతార తమిళంలో డోర కాష్మోర చిత్రాల్లో నటిస్తోంది.

nayanthara-hot-pics

ప్రస్తుతం కాటమరాయుడు సినిమా షూటింగ్‌లో ఉన్న పవన్.. తరువాత సినిమా త్రివిక్రమ్‌తోతీయనున్నట్లు ఈ మధ్య వార్తలొచ్చాయి. అదే విధంగా 2019 ఎన్నికల్లోపు నాలుగైదు సినిమాలు చేయలని పవన్ నిశ్చియించుకున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ వరుసగా సినిమాలు ఓకే చేస్తున్నాడు. మరీఈ సినిమా పట్టాలెక్కడానికి ఎంత సమయం పడుతుందో చూడాలి.

- Advertisement -