నాలుగేళ్ల జగన్ పాలన.. ఏంటి పరిస్థితి!

86
- Advertisement -

ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని స్థాపించి నాలుగేళ్ళు పూర్తి అయింది. దాంతో ఈ నాలుగేళ్లలో జగన్ సర్కార్ చేసిన అభివృద్ది ఏంటి ? ఏపీలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి ? అనే ప్రశ్నలపై ఆ రాష్ట్రంలో విస్తృత చర్చలు జరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలోనే 98.4 శాతం ఇచ్చిన హామీలను నెరవేర్చామని జగన్ సర్కార్ చెబుతోంది. మరోవైపు ఈ నాలుగేళ్లలోని జగన్ పాలనలో ఏపీ సర్వనాశనం అయిందని టిడిపి చెబుతోంది. ఇంతకీ ఏది నిజం అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమంపై గట్టిగా దృష్టి పెట్టారు ఇది ఎవరు కాదనలేని వాస్తవం..

అమ్మఓడి, రైతు భరోసా, సున్నా వడ్డీ రుణాలు, చేయూత.. ఇలా ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టి ఆ పథకాల ద్వారా పేదలకు నేరుగా నగదు పంపిణీ చేస్తున్నారు. అలాగే వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం అమలు చేసే పథకాలను పారదర్శకంగా ప్రజలకు చేరవేస్తున్నారు. ఇలా కొన్ని రకాల విధానాలు, ఆయా పథకాలపై ప్రజల్లో సానుకూల ప్రభావం ఉంది. ఇదే సందర్భంలో రాజధాని విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ లేకపోవడం, పలువురు ప్రభుత్వ నేతలపై అవినీతి ఆరోపణలు, ఇసుక విధానంలో జరుగుతున్నా అవకతవకలు.. ఇలా చాలా వాటిపై జగన్ సర్కార్ పై వ్యతిరేక గళం కూడా వినిపిస్తోంది. ఇంకా బస్ చార్జీల పెంపు, నిత్యవసర ధరల పెరుగుదల వంటి వాటితో సామాన్యుడు జగన్ సర్కార్ ను నిందించే పరిస్థితి.

Also Read: వామ్మో ఎలక్షన్స్.. బీజేపీ భయం !

ఇంకా వైఎస్ వివేకా కేసు, కుటుంబంలోని వ్యక్తిగత విభేదాలు ఇలా మరికొన్ని సమస్యలు కూడా వైఎస్ జగన్ పై నెగిటివిటీ పెంచుతున్నాయి. మొత్తం మీద ఈ నాలుగేళ్లలో జగన్ అధికారం చేపట్టిన తరువాత సంక్షేమంపై పెట్టిన దృష్టి అభివృద్ది పై కేంద్రీకరించలేదనేది కొందరు చెబుతున్నా మాట. పెట్టుబడులను ఆకర్షించడంలోనూ, పరిశ్రమలను నెలకొల్పడంలోనూ జగన్ సర్కార్ ఘోరంగా విఫలం అయిందని ప్రతిపక్ష పార్టీలు గట్టిగానే విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇవన్నీ బెరీజు వేస్తే ఈ నాలుగేళ్లలో జగన్ సర్కార్ పై సానుకూలత కంటే వ్యతిరేకతే ఎక్కువగా కనిపిస్తుందనేది రాజకీయవాదులు చెప్పే మాట. మరి వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ విషయంలో ఏపీ ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.

Also Read: కాంగ్రెస్ లో ఇప్పటికైనా.. వర్గపోరు తగ్గేనా !

- Advertisement -