భారీ వర్షాలతో ఉత్తర భారతం వణికిపోతోంది. అనేక నదులు డేంజర్ మార్క్‌ను దాటి ప్రవహిస్తుండటం…దేశ రాజధాని ఢిల్లీలోనూ యమునా నది వార్నింగ్ మార్క్ దగ్గర ప్రవహిస్తున్నది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ మరో నాలుగురోజులు ఉత్తరభారతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.ఉత్తరఖండ్, ఉత్తరప్రదేశ్, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఆగస్టు 27, 28వ తేదీలకు ఆరెంజ్ అలర్ట్‌ను ఐఎండీ జారీ చేసింది. ఆగస్టు 28వ తేదీన ఉత్తరప్రదేశ్‌కు, ఆగస్టు 20,30 తేదీలకు రాజస్థాన్‌లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. జమ్మూకశ్మీర్‌కు ఆగస్టు 27న, హిమాచల్ ప్రదేశ్‌కు ఆగస్టు 27, 28వ తేదీన ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
బంగాళాఖాతంలో ఒడిశా తీరంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రాయలసీమ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ 900 మీటర్ల ఎత్తున గాలుల ద్రోణి వ్యాపించి ఉండగా, రాష్ట్రంలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయి. దీంతో గురువారం తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.