కరోనాతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే మృతి..

243
dronamraju srinivas

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఈ మహమ్మారి బారినపడి సామాన్య ప్రజలతో పాటు ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సినీ,రాజకీయ ప్రముఖులు సైతం బలి అవుతున్నారు. కొందరు కోలుకుంటున్నప్పటికీ.. మరికొందరు మాత్రం ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కరోనాకు మరో రాజకీయ నేత బలయ్యారు. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూశారు.

ఆయనకు ఇటీవల కరోనా సోకగా, విశాఖలోని పినాకిల్ ఆసుపత్రిలో చేరారు. కొన్నిరోజుల కిందట కరోనా నెగెటివ్ వచ్చినా, ఇతర అనారోగ్యాల నుంచి కోలుకోలేకపోయారు. కరోనా కారణంగా ఇతర అవయవాలు దెబ్బతినడంతో చికిత్స పొందుతూ ఈ రోజు మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ద్రోణంరాజు శ్రీనివాస్ మృతితో వైసీపీ శ్రేణుల్లో విషాదం నెలకొంది.