గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న చెరియాల పోలీస్ అధికారులు..

105
green challenge

రాజ్యసభ సభ్యులు ఎంపీ, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన 3వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హుస్నాబాద్ ఏసిపి మహేందర్,చేరియాల సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ ఐ మోహన్ బాబు లు చెరియాల పోలీస్ స్టేషన్ ఆవరణలో మూడు మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దీనికి మద్దతుగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మొక్కల పెంపకం వాటిని కాపాడే బాధ్యత పర్యావరణ పరిరక్షణకి తీసుకుంటున్న చొరవ అభినందనీయం.ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు. ఇలాంటి మంచి కార్యక్రమానికి మా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇలానే కొనసాగాలని వారు కోరుకున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కొనకటి రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు ఎంపీ, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలిపారు.