ఉత్త‌మ్ పై చ‌ర్య‌లు తీసుకోవాలిః స‌ర్వే

214
servey satyanarana
- Advertisement -

టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డిపై మ‌రోసారి మండిపడ్డారు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, మాజీ కేంద్ర‌మంత్రి స‌ర్వే స‌త్య‌నారాయ‌ణ‌. ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి కుంతియాపై చేసిన వ్యాఖ్యలకు ఆంటోని తనని వివరణ కోరారని మాజీ ఎంపి సర్వే సత్యనారాయణ తెలిపారు. ఇటివ‌లే ఆయ‌న వాళ్ల‌పై చేసిన వాఖ్య‌ల‌కు ఎఐసిసి క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటి సంఘం చైర్మ‌న్ ఎకె ఆంటోనిని క‌లిశారు స‌ర్వే. త‌న‌ను స‌స్పెండ్ చేయ‌డం ఎంట‌ని ఆంటోని కూడా ఆశ్చ‌ర్య‌పోయార‌న్నారు.

ఉత్తమ్, కుంతియా తప్పిదాలను ఆంటోనీకి వివరించామని, ఎఐసిసి సభ్యుడిగా ఉన్న తనపై క్రమశిక్షణ చర్య తీసుకునే అధికారం ఉత్తమ్‌కు లేదని మండిపడ్డారు. ఉత్తమ్ చర్యల వల్ల ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, కోదండరామ్ అభాసుపాలయ్యారన్నారు. ఉత్త‌మ్ కుంతియా ఇద్ద‌రూ క‌లిసి చాలా చోట్ల సీట్ల‌ను అమ్ముకున్నార‌ని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసిన ఉత్తమ్‌పైనే చర్యలు తీసుకోవాలని సర్వే డిమాండ్ చేశారు. తన ఆరోపణలన్నీ రాతపూర్వకంగా ఇవ్వాలని ఆంటోని తనకు చెప్పారన్నారు.

- Advertisement -