ద‌ర్శకుడిని హీరోగా ప‌రిచ‌యం చేస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌

169
vijay Devarakonda Tharun Bhaskar

హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టేందుకు ఆస‌క్తి చూపుతున్నాడు. తాను ఎది చేసినా కొత్త‌గా ఉండాల‌ని అనుకుంటాడు విజ‌య్. అందుకు అనుగుణంగానే త‌న బ్యాన‌ర్ లో మొద‌టి సినిమాను ఓ ద‌ర్శ‌కుడిని హీరోగా ప‌రిచ‌యం చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట‌. నిర్మాత రంగానికి సంబంధించిన ప‌నుల‌ను చ‌క‌చ‌కా పూర్తి చేసుకుంటున్నాడ‌ని స‌మాచారం. త‌న బ్యాన‌ర్లో త‌క్కువ బ‌డ్జెట్ సినిమాలు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడ‌ట‌.

Tharun Bhascker
పెళ్లి చూపులు సినిమా ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ ను ఆయ‌న హీరోగా ప‌రిచ‌యం చేయాల‌నుకుంటున్నాడు. పెళ్లి చూపులు సినిమా ద్వారా త‌న‌కు ఇండ‌స్ట్రీలో మంచి గుర్తింపు తీసుకువ‌చ్చినందుకు కాస్త వెరైటిగా విజ‌య్ ఆ రుణాన్ని తీర్చుకోనున్నాడు. ఈమూవీని ఓ కొత్త ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించ‌నున్న‌నాడ‌ని స‌మాచారం. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైపోయాయి. త్వ‌ర‌లోనే ఈసినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియనున్నాయి.