- Advertisement -
ఆస్ట్రేలియా చరిత్రలో మొట్టమొదటిసారిగ ఒక తెలుగు వ్యక్తి రాంపాల్ ముత్యాల పెట్టబోయే రెస్టారెంట్ ‘దోసహట్’ ను ఆస్ట్రేలియా మాజీ ప్రధానమంత్రి మరియు ఎంపి గౌరణీయులైన టోనీ ఏబోట్ (Tony Abbott)శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా టోనీ ఏబోట్ మాట్లాడుతూ ఆస్ట్రేలియాలో భారతీయులు చేసే ప్రతి ఒక పనికి తన సహాయ సహకారాలు ఉంటాయని తెలియచేసారు. భారతీయ సంప్రదాయ గొప్పతనాన్ని, అలాగే భారతీయ సంప్రదాయంపై ఆయనకున్న గౌరవాన్ని వివరించాడు.
కాగా.. భారత ప్రధాని నరేంద్ర మోడీ తో ఆయనకు సత్సంబంధాలను గుర్తు చేసుకున్నారు టోనీ. అంతేకాకుండా.. ఈ కార్యక్రమంలో భారతీయ పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు మరియు వ్యాపారవేత్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
- Advertisement -