చిన్నపిల్లల రక్షణ కోసం పోలీస్ క్యాడర్ః మాజీ ఎంపీ వినోద్ కుమార్

335
-Vinod-Kumar
- Advertisement -

కైలాష్ సత్యర్ధి ఫౌండేషన్ బాలల హక్కుల పై సీఎస్ తో చర్చించారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. ఈసందర్భంగా వినోద్ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో బాలల సంఖ్య 60కోట్లు అంటున్నారని…పిల్లల జనాభాలో దేశం ముందు వరుసలో ఉందని చెప్పారు. తెలంగాణలో 15వేల మంది చిన్నారులను ప్రభుత్వం చేరదీసిందని గుర్తు చేశారు. బాలల కోసం ఇంకా చాలా చేయాల్సి ఉందన్నారు.

బాలల కమిషన్ ఏర్పాటు పై చర్యలు చేపట్టాలని సీఎస్ ను కోరినట్లు తెలిపారు. కొత్త జిల్లాలకు అనుగుణంగా కమిటీలు వేయాల్సి ఉందన్నారు. త్వరలోనే అన్ని కమిటీలు వేసేందుకు ప్రభుత్వం రెడీ ఉందని చెప్పారు. చిన్న పిల్లల సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు.ప్రత్యేకంగా చిన్నపిల్లల రక్షణ కోసం పోలీస్ క్యాడర్ ను ఏర్పాటు చేసేందుకు ప్రభ్యత్వం రెడీగా ఉందని చెప్పారు.

- Advertisement -