- Advertisement -
ఆంధ్రా ఆక్టోపస్ గా పేరుగాంచిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రెడ్డి నేడు ప్రెస్ మీట్ పెట్టడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. రేపు సాయంత్రం లగడపాటి ఎగ్టిట్ పోల్స్ ప్రకటించనున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం సంచలనంగా మారింది. ఈనెల 19 సాయంత్రం వరకు సర్వే ఫలితాలను వెల్లడించకూడదని ఆంక్షలు ఉన్నాయి.
సాయంత్రం 6 గంటలకు వెలగపూడి లోని వీ స్క్వేర్ ఫంక్షన్ హాల్ లో లగడపాటి ప్రెస్మీట్ ఏర్పాటు చేయనున్నారు. గత కొంతకాలంగా సర్వేలతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లగడపాటి ఆంధ్రా ఆక్టోపస్ గా పేర్గాంచారు. పలు సర్వేలతో ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో మాత్రం ఆయన సర్వే ఫలితాలు మిశ్రమంగా వచ్చాయి. లగడపాటి ప్రెస్ మీట్ ఏఅంశాలపై మాట్లాడుతాడన్న దానిపై ఆసక్తి నెలకొంది.
- Advertisement -