మాజీ ఎంపి కవిత ప్రత్యేక చొరవతో స్వగ్రామం లక్సెట్టిపేటలో భార్య,కూతురు పెద్దకర్మ కార్యక్రమానికి హాజరైయ్యాడు శ్రీనివాస్ అనే వ్యక్తి. అసలు విషయంలోకి వెళ్లితే.. ఈ నెల 15న మందమర్రి సమీపంలోని అంతరాష్ట్ర రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన భార్య సుజాత (40), కూతురు కావ్య (17)ల అకాల మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయి,ఈ నెల 22న రాత్రి దుబాయ్ నుండి హైద్రాబాద్ చేరుకున్న శ్రీనివాస్‌ను అధికారులు ఏయిర్ పోర్ట్ నుండి క్వరైంటెన్ కేంద్రానికి తరలించారు.
తన భార్య, కూతురు పెద్ద కర్మ కార్యక్రమంలో పాల్గొనడానికి అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి ద్వారా మాజీ ఎంపి కవిత దృష్టికి తీసుకెళ్లడంతో,సిఎస్ సోమేష్ కుమార్,డిజిపి మహేందర్ రెడ్డిలతో ప్రత్యేకంగా మాట్లాడి,సొంత ఖర్చులతో ప్రత్యేక వాహనంలో లక్సెట్టి పేట వెళ్ళి తిరిగి మళ్లీ హైద్రాబాద్ క్వరైంటేన్ కేంద్రానికి వచ్చేలా శ్రీనివాస్‌కు అనుమతులు ఇప్పించారు మాజీ ఎంపి కవిత.
భార్య,కూతురులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తనను ఓదార్చి,ఉన్నత స్థాయిలో అనుమతులు ఇప్పించి,డబ్బులు ఇచ్చి స్వగ్రామానికి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన మాజీ ఎంపి కవితకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు శ్రీనివాస్.