తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేసింది..

224
Srinivas goud
- Advertisement -

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని జెఎంఎస్‌లో 7కోట్ల అంచనా వెయ్యంతో సింతటిక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమంలో ఎంపీలు బండా ప్రకాష్, పసునూరి దయాకర్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మేయర్ గుండా ప్రకాష్ రావు,కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతులు పాల్గొన్నారు.

Minister Srinivas Goud

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. క్రీడాలకు పుట్టినిల్లు వరంగల్ జిల్లా. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక పతకాలు వచ్చాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం క్రీడలకు అనేక నిధులను కేటాయిస్తుంది.గ్రామీణ స్థాయిలో క్రీడలను అభివృద్ధి చేస్తాం అని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.

Minister errabelli

మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేసింది. వరంగల్ జిల్లా ఉద్యమాల ఖిల్ల.ఇక్కడి యువకులు ఆటల్లో అంతర్జాతీయ స్థాయిలో నిలిచారు. ప్రతి జిల్లాలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామన్నారు. 1000 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెస్సింగ్ యూనిట్‌ను ప్రారంభించనున్నాం. తెలంగాణలో అనేక మంది వలస కూలీలు ఇక్కడికి వచ్చి బ్రతుకుతున్నారు. రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ప్రతి నియజక వర్గంలో స్టేడియను నిర్మించాం. కాళేశ్వరం ప్రాజెక్టును 3 సంవత్సరాలల్లో పూర్తి చేసి వ్యవసాయనికి 365 రోజులు సాగునీరు అందిస్తున్నారు అని శ్రీనివాస్‌ గౌడ్ తెలిపారు.

- Advertisement -