నాంపల్లి దర్గాలో మాజీ ఎంపీ కవిత ప్రత్యేక ప్రార్థనలు..

186
Former MP K Kavitha

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, నాంపల్లిలోని యుసిఫియన్ దర్గాను సందర్శించి చాదర్ సమర్పించారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం మత పెద్దలు ఆమెకు ఆశీస్సులు అందజేశారు. సోమవారం (అక్టోబర్ 12న)న నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడతున్న నేపథ్యంలో కవిత దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.హోమ్ మంత్రి మహమూద్ అలీ, డెప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన, స్థానిక కార్పొరేటర్ లు,టిఆర్ఎస్ శ్రేణులు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు స్వాగతం పలికారు.