కరోనా వైరస్ తో ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం

345
Bura Narsaiha Goud
- Advertisement -

కరోనా వైరస్ వల్ల దేశ ఆర్ధిక వ్యవస్ధ తీవ్రంగా దెబ్బతిన్నదన్నారు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్. కోరిన వైరస్ నివారణకు తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో పేద , మధ్య తరగతి కుటుంబాలు, చిరు వ్యాపారులకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఈఎంఐల చెల్లింపునకు 2 నెలలు గడువు ఇవ్వాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాశారు బూర నర్సయ్య గౌడ్.

ఈ సందర్భంగా బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. పేదలు తీసుకున్న లోన్లకు సంబంధించి రెండు నెలలు వెసులు బాటు కల్పించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. కరోనా నివారణకు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులను భాగస్వాములను చేయాలి. కరోనా నిర్దారణ కోసం ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లకు ప్రభుత్వ పర్యవేక్షణలో అనుమతి ఇవ్వాలని కోరారు. విదేశాల నుంచి వచ్చిన వారు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే వారికి సెల్ఫ్ క్వారంటైన్ చేసుకునేలా దేశవ్యాప్తంగా కొన్ని హోటల్స్ లో ప్రత్యేక వసతులు కల్పించాలని లేఖలో పేర్కోన్నారు.

- Advertisement -