- Advertisement -
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. హైదరాబాద్‌లో తన నివాసంలో ఉన్న వంశీని అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై కేసులో వంశీని అరెస్ట్ చేస్తారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు వంశీ . అయితే వంశీని ఏ కేసులో అరెస్ట్ చేశారో పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. ఈ నెల 20న వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ మీద తీర్పు రానుంది. ఈలోపే వంశీ అరెస్టు అవడం ఇప్పుడు కీలకంగా మారింది.
2023 ఫిబ్రవరి 20న గన్నవరంలో టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగింది.
Also Read:రామాలయంలో హిందూ,ముస్లింల పూజలు
- Advertisement -