రామాలయంలో హిందూ,ముస్లింల పూజలు

14
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లోని కళ్యాణదుర్గం నియోజకవర్గం లో వందల ఏళ్ల పురాతన పట్టాభి రామస్వామి దేవస్థానమునం లో కొలువుదీరిన సీతారాములకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఆమిలినేని సురేంద్రబాబు పట్టు వస్త్రాలను సమర్పించారు. ముఖ్యంగా ఎన్నో ఏళ్లగా ఉన్న పట్టాభి రామస్వామి దేవాలయంలో ఈరోజు హిందువులు ముస్లింలు కలిసి పట్టాభి రామస్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

హిందూ దేవుడికి లక్ష పూలతో ముస్లింలు ప్రత్యేక కానుకను అందజేశారు. ఎక్కడ లేని విధంగా దేశంలో హిందువులు ముస్లింలు కళ్యాణదుర్గంలో ఏకమయ్యారని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు తో పాటు కళ్యాణదుర్గం నియోజకవర్గ ముస్లింలు కూడా ఆలయంలోకి ప్రవేశించి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. జై శ్రీరామ్ అంటూ ముస్లింలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేంద్రబాబు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంనీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టినట్లు వెల్లడించారు. బి టి పి ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి కళ్యాణ్ దుర్గం ను సస్యశ్యామలం చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Also Read:త్వరలో హరీశ్ రావు పాదయాత్ర!

- Advertisement -