ప్రేమికుల దినోత్సవం సందర్బంగా అదిరిపోయే స్టంట్లు అంటూ.. అదేదో ఘనత సాధించినట్లు కొన్ని జంటలు సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలను వదులుతున్నాయి. అతి వేగంతో ప్రమాదకరరీతిలో చేసే ఈ చిత్ర విచిత్ర విన్యాసాలు మీకు సరదాగా అనిపించొచ్చు.. కానీ జరగరాని ప్రమాదం జరిగితే ఏమవుతుందో ఒకసారి ఊహించుకోండని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ వీడియోను షేర్ చేశారు.
సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు రోడ్లపై ప్రమాదకర స్టంట్లు చేయడం డేంజర్. ఇలాంటి సాహసాలు చేసి ప్రమాదాలు కొనితెచ్చుకొని.. మీ కుటుంబసభ్యులను మనోవేదనకు గురిచేయకండని విజ్ఞప్తి చేశారు సజ్జనార్.
‘వాలంటైన్ డే’ పేరుతో ఇవేం వెర్రి పనులు!!
ప్రేమికుల దినోత్సవం సందర్బంగా అదిరిపోయే స్టంట్లు అంటూ.. అదేదో ఘనత సాధించినట్లు కొన్ని జంటలు సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలను వదులుతున్నాయి.
అతి వేగంతో ప్రమాదకరరీతిలో చేసే ఈ చిత్ర విచిత్ర విన్యాసాలు మీకు సరదాగా అనిపించొచ్చు.. కానీ జరగరాని… pic.twitter.com/4cxwizkT80
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) February 13, 2025
Also Read:రామాలయంలో హిందూ,ముస్లింల పూజలు

