అధికారిక లాంఛనాలతో ముత్యంరెడ్డి అంత్యక్రియలు

351
muthyam Reddy

మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత చెరుకు ముత్యం రెడ్డి మృతి చెందారు. ముత్యం రెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరిపించాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె జోషి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముత్యం రెడ్డి పట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.

నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ముత్యంరెడ్డి స్వస్థలం సిద్ధిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్. తొగుట సర్పంచ్‌గా ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. సహకార సంఘం ఛైర్మన్‌గా రెండేండ్ల పాటు సేవలందించారు. 1989లో దొమ్మాట నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా తొలిసారి గెలుపొందారు. 1994, 1999 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999లో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో మరోసారి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచారు.