అభినందన్‌….ఈజ్ బ్యాక్

615
abhinandan
- Advertisement -

భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ మళ్లీ ఫీల్డులోకి అడుగుపెట్టారు. పాక్ చెర నుంచి విముక్తి పొందిన తర్వాత తొలిసారి పూర్తి ఫిట్‌నెస్‌తో మిగ్-21 ఎయిర్‌క్రాప్ట్ నడిపారు. సుమారు ఆరు నెలల తర్వాత …చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవాతో కలిసి మిగ్ విమానం విజయవంతంగా నడిపాడు.

బాలాకోట్ దాడుల నేపథ్యంలో అభినందన్ పేరు వార్తల్లో నిలిచింది. ఫిబ్రవరి 27న పాకిస్థాన్ ఫైటర్ జెట్స్‌తో అభినందన్ వీరోచితంగా పోరాడారు. పాక్‌కు చెందిన F-16 ఫైటర్ జెట్‌ను కూల్చేశారు. ఆ క్రమంలో అభినందన్ ప్రయాణిస్తున్న మిగ్-21 విమానం కూలిపోయింది. దురదృష్టవశాత్తూ ఆయన పీఓకేలో ప్రవేశించారు. దాంతో పాక్ సైనికులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

ఈ క్రమంలో పాక్‌తో భారత దౌత్యం ఫలించడంతో 48 గంటల్లోనే అభినందన్‌ విడుదలయ్యారు. పాక్ చెరలో ఉన్న సమయంలో అంతులేని ధైర్యాన్ని ప్రదర్శించిన ఆయన హీరోగా మారిపోయారు. ఆయన సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల అభినందన్‌కు వీరచక్ర పురస్కారాన్ని ప్రకటించింది.

- Advertisement -