బాబాయ్‌కి బర్త్‌ డే విషెస్‌ చెప్పిన చెర్రి..

632
ram charan

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు నేడు. ఈ నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పవన్ కల్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మెగాపవర్ స్టార్ రామచరణ్ ఆయన్ని ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బాబాయ్‌తో కలిసి దిగిన ఫొటోలను చరణ్ తన ఫేస్ బుక్ సహా అధికారిక సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

కల్యాణ్ బాబాయ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. ఫ్రెండ్- మెంటర్- గైడ్‌గా ఎప్పుడూ నాతో ఉన్నందుకు థాంక్స్.. అంటూ చరణ్ ఎమోషనల్‌గా వ్యాఖ్యను జోడించారు. ఈ ఫోటోలు ప్రస్తుతం మెగాభిమానుల సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతున్నాయి.