మాజీ రక్షణ శాఖ మంత్రి జార్జ్ ఫెర్నాండేజ్ (88 ఏళ్లు) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నేడు కన్నుమూశారు. జార్జి ఫెర్నాండెజ్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. కార్మికనేతగా, కేంద్రమంత్రిగా జార్జి ఫెర్నాండెజ్ ఉత్తమ సేవలు అందించారని సీఎం కొనియాడారు.
1970వ దశకంలో సాగిన సొషలిస్టు ఉద్యమంలో ఫెర్నాండేజ్ కీలక పాత్ర పోషించారు. జనతాదళ్ నేతగా కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఫెర్నాండేజ్ సమతా పార్టీని స్థాపించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో జార్జ్ ఫెర్నాండేజ్ రక్షణ శాఖ మంత్రిగా చేశారు.
జార్జ్ ఫెర్నాండేజ్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. భారత రాజకీయ నేతల్లో జార్జ్ సాబ్ ఉత్తముడని మోదీ ట్వీట్ చేశారు. అతను ముక్కుసూటి మనిషి అని, నిర్భయుడన్నారు. దేశానికి ఆయన విలువైన సేవలు అందిచారన్నారు. పేద, అణగారిని ప్రజలకు ఆయన బలమైన గొంతుగా నిలిచారన్నారు. ఫెర్నాండేజ్ మంత్రిగా ఉన్నప్పుడు కార్మిక సంఘాలు న్యాయం కోసం పోరాటం చేశాయన్నారు.