- Advertisement -
సీతమ్మ సాగర్ బ్యారేజి నిర్మాణం కోసం 27.9 హెక్టార్ల (68.9 ఎకరాలు) అటవీ భూమిని తెలంగాణ నీటిపారుదల శాఖకు బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
దేవాదుల ప్రాజెక్టుకు నిరంతరం నీటి సరఫరా చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై సీతమ్మ సాగర్ పేరుతో బ్యారేజి నిర్మాణం తలపెట్టింది. దీనికోసం ములుగు మండలం ఏటూరు నాగారం, వెంకటాపురం అటవీ డివిజన్ల పరిధిలో అటవీ భూమి సేకరించడం అవసరం అయింది.
దీంతో రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం ఆ భూమిని కేంద్ర అటవీశాఖ బదలాయించింది. దీంతో పాటు బ్యారేజి నిర్మాణానికి అవసరమైన తుది పర్యావరణ అనుమతులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది.
- Advertisement -