- Advertisement -
విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ప్రభుత్వం టీకాలు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లే వారి కోసం కరోనా సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ గడువును కుదిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తొలి డోస్ వేసుకున్న వారు 84 రోజులు ఆగాల్సి వస్తుండటంతో గడువును తగ్గించాలని కేంద్రాన్ని అంతా కేంద్రాన్ని కోరారు.
వీరికి తోడు జపాన్ లో ఒలింపిక్స్ జరగనున్న నేపధ్యంలో క్రీడాకారులు కూడా ఇదే రకమైన వినతులు చేయగా వారి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కేంద్రం వ్యాక్సినేషన్ ప్రోటోకాల్ నిబంధనల్లో మార్పులు చేసింది. సెకండ్ డోస్ వేసుకోవడానికి గడువును 4 వారాలకు కుదిస్తూ ప్రకటన విడుదల చేసింది.
- Advertisement -