అభిమానులకు సినీ నటుడు బాలకృష్ణ బహిరంగ లేఖ

37
nbk

అభిమానులకు సినీ నటుడు,హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ బహిరంగ లేఖ రాశారు. జూన్ 10న తన పుట్టిన రోజు. ప్రతీ సంవత్సరం బాలయ్య పుట్టిన రోజును ఘనంగా జరుపుకుంటారు అభిమానులు. అయితే ఈ సారి కరోనా నేపథ్యంలో పుట్టినరోజు వేడుకులను జరుపుకోవడం లేదని తెలిపారు బాలయ్య.

ప్రతిఏటా జూన్ 10 వతేదీ నాపుట్టినరోజునాడు ..నన్ను కలిసేందుకు నలుదిక్కులనుండీ తరలివస్తున్న మీ అభిమానానికి సర్వదా విధేయుడిని,కానీ కరోనా విలయతాండవం చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో మీరు రావటం అభిలషణీయం కాదు. నన్నింతటివాడ్ని చేసింది మీఅభిమానం..ఒక్క అభిమాని దూరమైనా నేను భరించలేను ..మీ అభిమానాన్ని మించిన ఆశీస్సు లేదని లేఖలో పేర్కొన్నారు బాలయ్య.

మీ ఆరోగ్యాన్ని మించిన శుభాకాంక్ష లేదు,మీ కుటుంబం తో మీరు ఆనందంగా గడపటమే నా జన్మదినవేడుక అన్నారు. దయచేసి రావద్దని మరీ మరీ తెలియజేస్తూ ..ఈ విపత్కాలంలో అసువులు బాసిననా అభిమానులకూ కార్యకర్తలకూ అభాగ్యులందరికీ నివాళులర్పిస్తున్నానని తెలిపారు.