చెన్నైలో ఆదివారం జరిగిన బాహుబలి-2 తమిళ వెర్షన్ ఆడియో విడుదల వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ ఆడియో ఫంక్షన్‌లో ప్రభాస్ మాట్లాడుతూ..రాజమౌళి కోసం ఎన్ని సంవత్సరాలైనా కష్టపడేవాడినే అన్నాడు డార్లింగ్. రాజమౌళి కోసం బాహుబలి మీద నాలుగేళ్ల కన్నా ఎక్కువ పనిచేసేందుకు కూడా తాను రెడీగానే ఉండేవాడని, ‘బాహుబలి’ కోసం నాలుగేళ్లే కాదు.. ఏడేళ్లు కావాలన్నా మరో ఆలోచన లేకుండా ఇచ్చేవాడినని ప్రభాస్ అన్నారు.
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా మారిన బాహుబలిలో పనిచేసిన ఎక్స్‌పీరియన్స్‌ని కూడా పంచుకున్నాడు ప్రభాస్. తాను శారీరకంగా బాగా కష్టపడాల్సి వచ్చేదని, ముఖ్యంగా మొదటి పార్టులో యాక్షన్ సీన్ల కోసం మరింత ఎక్కువ కష్టపడాల్సివచ్చిందని చెప్పాడు. అయితే..రెండోపార్టులో రాజమౌళి యాక్షన్ సీన్లను ఎడిటింగ్ చేయడం వల్ల ఈ ప్రక్రియ సులభంగా మారిందని కూడా డార్లింగ్ చెప్పేశారు.
తన సినిమా కోసం మూడేళ్లపాటు వేచి ఉన్నఫ్యాన్స్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. ప్రభాస్ ఎంతో చిత్తశుద్ధి ఉన్న నటుడని, బాహుబలి పాత్రకు ప్రభాస్‌ను తప్ప వేరే ఎవరినీ ఊహించుకోలేమని అన్నారు. ఛత్రపతి సినిమా నాటి నుంచి ప్రభాస్‌తో తనకు చక్కని అనుబంధముందంటూ తన స్నేహితుడిగా ఉన్నందుకు ప్రభాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు జక్కన్న.
జక్కన్న కోసం దేనికైనా రెడీ : ప్రభాస్
- Advertisement -
- Advertisement -