సొంత బ్యాన‌ర్ లో నాగ‌శౌర్య..

176

“ఊహ‌లు గుస‌గుస‌లాడే”, “దిక్కులు చూడ‌కు రామ‌య్య‌”, “ల‌క్ష్మిరావే మా ఇంటికి”, “క‌ళ్యాణ‌ వైభోగమే”,” జ్యో అచ్యుతానంద‌” లాంటి విభిన్న క‌థాంశాల‌తో విజ‌యాలు సాధించిన నాగ‌శౌర్య హీరోగా, క‌న్న‌డ‌ లో “కిరాక్ పార్టీ” అనే చిత్రంలో త‌న క్యూట్ ఫెర్‌ఫార్మెన్స్ తో అంద‌రి మ‌న‌సులు దోచుకున్న ర‌ష్మిక మండ‌న్న‌ని హీరోయిన్ గా టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ చేస్తూ…., మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ లో ప‌నిచేసిన వెంకి కుడుముల ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ, ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై నిర్మాత‌లు ఉషా మూల్పూరి, శంక‌ర ప్ర‌సాద్ మూల్పూరి లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్ర ప్రారంభోత్సవం సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా జరిగింది. ప్రముఖ కథానాయకుడు నారా రోహిత్ హీరో హీరోయిన్లపై క్లాప్ కొట్టగా…., ప్రముఖ పారిశ్రామిక వేత్త రాజేష్ కిలారు కెమెరా స్విఛాన్ చేశారు. ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ గా కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో జ‌రిగే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈనెలాఖరులో ప్రారంభమౌతుంది.

ఈ సంద‌ర్బంగా నిర్మాత‌ల్లో ఒక‌రైన శంక‌ర ప్ర‌సాద్‌ మూల్పూరి మాట్లాడుతూ..” మా అబ్బాయి నాగ‌శౌర్య ని తో చిత్రాన్ని నిర్మించాల‌ని ఎప్ప‌టినుంచో అనుకుంటున్నాము. త్రివిక్ర‌మ్ అసోసియేట్ వెంకి కుడుముల చెప్పిన క‌థ మాకు న‌చ్చి మా బ్యాన‌ర్ లోనే చేయ్యాల‌ని నిర్ణ‌యించుకున్నాము. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఈ రోజు జరిగింది. నారా రోహిత్ క్లాప్ నివ్వగా, రాజేష్ కిలారు గారు కెమెరా స్విఛాన్ చేశారు. ఈనెలాఖరులో రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తున్నాం. మ‌రిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. అని అన్నారు

NagaSourya New Movie Opening

హీరో నాగశౌర్య మాట్లాడుతూ.. మా ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం. 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. వెంకీ దర్శకుడు. రష్మిక హీరోయిన్. నారా రోహిత్ క్లాప్ కొట్టారు. ఇకపై మా బ్యానర్ లో మంచి చిత్రాలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాను. ఈ నెలాఖరులో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్తున్నాం. అని అన్నారు.

హీరోయిన్ రష్మిక మాట్లాడుతూ – నా డెబ్యూ తెలుగు చిత్రం ఇది. ఓ మంచి కథతో, క్యారెక్టర్ తో తెలుగులో లాంచ్ అవుతున్నందకు చాలా హ్యాపీగా ఉంది. ఆల్ ది బెస్ట్ టూ ఎంటైర్ టీం. అని అన్నారు.

ద‌ర్శ‌కుడు వెంకి కుడుముల మాట్లాడుతూ..” నాకు ఇంత మంచి అవ‌కాశాన్ని ఇచ్చిన హీరో నాగ‌శౌర్య, నిర్మాత‌లు ఉషా ముల్పూరి, శంక‌ర‌ప్ర‌సాద్ ముల్పూరికి ధ‌న్య‌వాదాలు. నాగ‌శౌర్య కి జంట‌గా ర‌ష్మిక మండ‌న్న‌ న‌టిస్తుంది. ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. అని అన్నారు.

నటీనటులు – నాగశౌర్య, రష్మిక మండన్న, సీనియర్ నరేష్, ప్రగతి, రఘుబాబు, పోసాని, వెన్నెల కిషోర్, ప్రవీణ్, సత్య, సుదర్శన్, స్వప్నిక, మైమ్ గోపి, అచ్యుత కుమార్ తదితరులు

సాంకేతిక నిపుణులు
సంగీతం- సాగ‌ర్ మ‌హ‌తి,
సినిమాటోగ్ర‌ఫి- సాయి శ్రీరామ్‌.
ఎడిటర్ – కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి)
ఆర్ట్ – రామ్ కుమార్
లిరిక్స్ – భాస్కరభట్ల
కొరియోగ్రఫి – రఘు
లైన్ ప్రొడ్యూసర్ – ఎస్. నాగేశ్వరరావు (బుజ్జి)
నిర్మాత‌లు- ఉషా ముల్పూరి, శంక‌ర ప్ర‌సాద్ ముల్పూరి
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ – వెంకి కుడుముల‌