ధురంధర్ మూవీ సెట్‌లో ఫుడ్ పాయిజన్!

8
- Advertisement -

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ నటిస్తున్న ధురంధర్ మూవీ సెట్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. దీంతో 120మంది సిబ్బంది ఆస్పత్రి పాలయ్యారు. లద్దాఖ్‌లోని లేహ్ జిల్లాలో మూవీ షూటింగ్ జరుగుతోంది.

బాధితుల్లో 4–5 సంవత్సరాల వయసున్న చిన్నారులు నుంచి 10 ఏళ్ల పిల్లలు కూడా ఉన్నారు. వీరంతా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు. లేహ్ అదనపు పోలీస్ సూపరింటెండెంట్ రెగ్జిన్ సాంగ్‌డుప్ మాట్లాడుతూ..ధురంధర్ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఈ ఘటన జరిగింది. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ నమూనాలు సేకరించింది. చీజ్, చికెన్‌లో ఏదో సమస్య ఉన్నట్లు కనిపిస్తోంది అని తెలిపారు. వీరంతా షూటింగ్‌లో పని చేసేవారు… ఎవరూ సీరియస్‌లో లేరని తెలిపారు.

షూటింగ్ లొకేషన్‌లో సుమారు 600 మంది భోజనం చేశారు. అయితే అందరికీ ఒకే ఆహారం అందించలేదు. చాలామందిని ఇప్పటికే డిశ్చార్జ్ చేశాం అని ఒక అధికారి చెప్పారు.

Also Read:తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన

- Advertisement -