ఆయిల్ పామ్ సాగుతో రైతులకు అధిక ప్రయోజనం- మంత్రి

161
harish
- Advertisement -

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సోమవారం బి.ఆర్.కె.ఆర్ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు పెంపుపై చర్చించారు.రాబోయే సంవత్సరాల్లో ఆయిల్ పామ్ సాగును రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేపట్టనున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. 2022వ సంవత్సరంలో ఆయిల్ పామ్ సాగును భారీ స్థాయిలో చేపట్టుటకు ఇప్పటి నుండే ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పర్యావరణ అనుకూలమైన ఆయిల్ పామ్ సాగుతో రైతులకు ఎక్కువగా ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.

ఆయిల్ పామ్ నర్సరీలను పెంచడానికి చర్యలు తీసుకోవాలని వివిధ శాఖల అధికారులను కోరారు, ఆయిల్ పామ్ విస్తీర్ణాన్ని పెంచడంలో మొక్కల లభ్యతే ప్రధాన అంశమని మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రైతుబంధు సమితి చైర్మన్ మరియు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -