లోకల్ బ్రాండ్లను విశ్వవ్యాప్తం చేస్తాం: నిర్మలా

252
nirmala
- Advertisement -

స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యమిస్తూ.. లోకల్‌ బ్రాండ్లను విశ్వవ్యాప్తం చేయడమే తమ లక్ష్యమన్నాను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ పథకం గురించి మీడియాతో మాట్లాడిన ఆమె… అభివృద్ధిని ఆకాంక్షిస్తూ స్వయం సమృద్ధితో కూడిన భారత్‌ నిర్మాణం కోసమే భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినట్లు తెలిపారు.

ఆర్థిక, మౌలిక, సాంకేతిక, దేశ జనాభా, డిమాండ్‌ సూత్రాలు ఆత్మ నిర్భర భారత్‌కు మూల స్తంభాలన్నారు. భూమి, నగదు లభ్యత, పాలనాపరమైన విధానాలే కీలకం అన్నారు. స్థానిక బ్రాండ్లకు అంతర్జాతీయ స్థాయి కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

లాక్‌డౌన్‌ కాలంలోనూ కేంద్రం అనేక సంక్షేమ పథకాలను నిరంతరాయంగా అమలు చేస్తోందని స్పష్టం చేశారు. భారత్‌ స్వయంపూర్వకంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. పీపీఈ కిట్లు, మాస్క్‌ల తయారీలో ఎంతో ప్రగతి సాధించామన్నారు.

- Advertisement -