- Advertisement -
దసరా పండగను క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ ఆన్‌లైన్ సంస్థలు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా ఫ్లిప్ కార్ట్ తొలి అడుగు వేసి ఈ నెల 16 నుంచి 21 వరకు బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ప్రకటించింది.
తన పాత, కొత్త కస్టమర్లకు పెద్ద మొత్తంలో ప్రొడక్ట్‌లను ఆఫర్ చేయనున్నామని చెప్పింది. ఈ సేల్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న చిన్న సంస్థలకు, సెల్లర్లకు గ్రోత్ అవకాశాలను కల్పించనున్నామని పేర్కొంది.
ఈ ఫెస్టివ్ సీజన్‌లో ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోమ్ ఫర్నిషింగ్ వంటి కొన్ని కేటగిరీలకు భారీగా డిమాండ్ ఉంటుందని అంచనా. రెడ్‌సీర్ అంచనాల ప్రకారం ఈ ఏడాది ఫెస్టివ్ సేల్స్ రెండింతలు పెరిగి 7 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని అంచనా. త్వరలోనే అమెజాన్ కూడా భారీ ఆఫర్లతో కూడిన డేట్స్‌ని ప్రకటించే అవకాశం ఉంది.
- Advertisement -