ఇండోనేషియాలో విమానం అదృశ్యం..

75
Indonesia flight

ఇండోనేషియాలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. 62 మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ బోయింగ్ విమానం అదృశ్యమైంది. రాజధాని జకార్తాలోని సుకర్ణో-హట్టా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ బోయింగ్ 737-500 విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో సంబంధాలు కోల్పోయింది. స్రివిజయ ఎయిర్ లైన్స్ కు చెందిన ఈ విమానం పాంటియానక్ వెళ్లాల్సి ఉంది. ఈ విమానంలో 56 ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.

ఘటనపై స్పందించిన ఇండోనేషియా అధికారులు రాడార్ సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు. కాగా, ఫ్లైట్ రాడార్ 24 అనే సంస్థ తెలిపిన వివరాల ప్రకారం…. టేకాఫ్ అనంతరం 11 వేల అడుగుల ఎత్తుకు చేరిన ఈ బోయింగ్ విమానం ఒక్కసారిగా 250 అడుగుల ఎత్తుకు జారిపోగా, ఆ తర్వాత ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. ప్రస్తుతం దీనికోసం ముమ్మరంగా గాలింపు చర్యలు జరుగుతున్నాయి. టేకాఫ్ అయిన తర్వాత సముద్రంలో కూలిపోయి ఉంటుందని భావిస్తున్నారు. విమానం జ‌క‌ర్తా నుంచి బోర్నియో ఐలాండ్‌లోని పోం‌టియాన‌క్‌కు వెళ్తూ అదృశ్య‌మైంద‌ని ఇండోనేషియా ట్రాన్స్‌పోర్టు మినిస్ట్రీ వెల్ల‌డించింది.