కొత్తగా 199 కరోనా పాజిటివ్‌ కేసులు..

30
corona

ఏపీలో ఇవాళ కొత్తగా 199 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 423 మంది కోలుకున్నారు. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు 8,84,689 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 8,74,954 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 2,607 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 7,128 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం నివేదికలో వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 50,445 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 1,22,74,647శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.