మళ్లీ తెరాస విజయం ఖాయం..

344
- Advertisement -

తాజాగా ఫ్లాష్ టీం సర్వేలో గులాబీ పార్టీ సత్తా ఏంటో మరోసారి రుజువయ్యింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్రంలోని 119 సీట్లలో సరాసరి 90 చోట్ల టీఆర్ఎస్ గెలుస్తుందని స్పష్టమయ్యింది. వీటికి ఐదు సీట్లు ఎక్కువ తక్కువ కావచ్చని పేర్కొన్నది. 90 చోట్ల 50 శాతానికి పైగా ఓట్లు వస్తాయని, ప్రతిపక్షాలేవీ తమ దరిదాపుల్లో కూడా ఉండవని సీఎం కేసీఆర్ పదేపదే చెబుతున్న విషయాన్ని ఈ సర్వే బలపరిచింది. కాంగ్రెస్‌కు 15, బీజేపీ-3, ఎంఐఎం-7, ఇతరులు-2 సీట్లలో గెలుస్తారని సర్వే వెల్లడించింది.

TRS

ఫ్లాష్ టీం సర్వేలో అన్ని అంశాల్లోనూ సీఎం కేసీఆర్ పాలనకు, టీఆర్ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సీఎం కేసీఆర్ పనితీరు బాగుందని 67.26 శాతం మంది అభిప్రాయపడ్డారు. తెలంగాణలో టీఆర్ఎస్ మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని 52.58 శాతం మంది స్పష్టం చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ కు 44-48 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో తేలింది.

- Advertisement -