మొక్కలు నాటడం సంతోషంగా ఉంది : ఫిష్ వెంకట్

43
venkat
- Advertisement -

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ జోరుగా కొనసాగుతోంది. రోజురోజుకు ప్రముఖులు మొక్కలు నాటుతూ వాటి ప్రాముఖ్యత గురించి ప్రచారం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సినీ నటుడు ఫిష్ వెంకట్ జూబ్లీహిల్స్ జీహెచ్‌ఎంసీ పార్క్‌లో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఫిష్ వెంకట్ మాట్లాడుతూ… గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -