జూన్‌ 8 నుంచి ఫిష్ ఫుడ్ ఫెస్టివల్:తలసాని

31
- Advertisement -

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ నెల 8, 9, 10 తేదీల్లో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ అన్నారు. గురువారం సచివాలయంలో అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా పలు కీలకనిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో సబ్సిడీ గొర్రెల యూనిట్లు పొందిన గొర్రెల పెంపకందారులు, ప్రభుత్వం సబ్సిడీపై అందజేసిన వాహనాలు, ఉచిత చేప పిల్లల ద్వారా లబ్ధిదారులు అత్యధికంగా ఉన్నారని, ఉత్సవాల్లో పశుసంవర్ధక, మత్స్య శాఖల ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని చెప్పారు.

ఉత్సవాలలో భాగంగా జూన్ 3న తెలంగాణ రైతు దినోత్సవం సందర్భంగా గ్రామాల్లోని రైతు వేదికల వద్ద నిర్వహించే కార్యక్రమాల్లో పాడి రైతులు, మత్స్యకారులు పాల్గొనే విధంగా డెయిరీ అధికారులు, మత్స్య శాఖ అధికారులు, పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. 8న చెరువుల పండుగ సందర్భంగా ప్రధాన చెరువులు, రిజర్వాయర్ల వద్ద వేదికలను ఏర్పాటు చేసి వివిధ కార్యక్రమాల ను నిర్వహించాలని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప, రొయ్య పిల్లల పంపిణీ ఇతర పథకాలపై ప్లేక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Also Read: అంతుచిక్కని డీకే వైఖరి !

రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న పరిస్థితులు, తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమాలు, ఫొటో ప్రదర్శనలు నిర్వహించాలని చెప్పారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా అన్ని పశువైద్యశాలల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. మేలుజాతి దూడల సంపద అభివృద్ధి కోసం కృత్రిమ గర్భధారణ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో గోపాల మిత్రులు కూడా పాల్గొనేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. అలాగే 21రోజుల పాటు ప్రతి రోజు వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల్లో ప్రజలు పాల్గోనేలా చూడాలని మంత్రి ఆదేశించారు.

Also Read: ఆపరేషన్ ” ఘర్ వాపసి “.. ఫలిస్తుందా ?

- Advertisement -