మెగాస్టార్‌కు రాఖీ కట్టిన మహానటి..

98

మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న తాజా మూవీ ‘భోళా శంకర్’. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ రోజు చిరు బర్త్ డే సందర్భంగా, కొద్ది సేపటి క్రితం చిత్ర టైటిల్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ క్రమంలో ఈ సినిమా నుండి మరో లేటెస్ట్‌ అప్‌డేట్‌ వచ్చింది. తాజాగా ఈ చిత్రంలో చిరుకు చెల్లిగా కీర్తి సురేశ్ నటిస్తున్నట్టు మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. ఈమేరకు ఓ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో చిరంజీవికి కీర్తి సురేశ్ రాఖీ కడుతుండాన్ని చూపించారు.

అన్నయ్య చిరుకు కీర్తి సురేష్ రాఖీ కడుతున్న వీడియోను విడుద‌ల చేసి.. చెల్లెలంద‌రి ర‌క్షా బంధం, అభిమానులంద‌రి ఆత్మ బంధం, మ‌నంద‌రి అన్న‌య్య జ‌న్మ‌దినం అంటూ కొటేష‌న్ కూడా ఇచ్చారు. చిరు లుక్‌తో పాటు కీర్తి సురేష్ లుక్ కూడా ఆక‌ట్టుకునేలా ఉంది. మాస్‌కు కావాల్సిన యాక్షన్ పార్ట్, ఫ్యామిలీకి కావాల్సిన ఎమోషన్ అన్నీ కూడా ఇందులో ఉండబోతున్నాయి.

#RakhiWithBholaaShankar | MegaStar Chiranjeevi, Keerthy Suresh | Meher Ramesh | Anil Sunkara