ఆచార్యతో గడిపిన ఈ క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను- రామ్ చ‌ర‌ణ్

136
Ram Charan
- Advertisement -

మెగాస్టార్‌ చిరంజీవి బ‌ర్త్ డే సంద‌ర్భంగా.. రామ్ చ‌ర‌ణ్ త‌న తండ్రికి స్పెషల్‌ బర్త్‌డే విషెస్‌ చెప్పారు. ఈ మేరకు ఆచార్య షూట్‌లో భాగంగా తన తండ్రితో గడిపిన ప్రతి క్షణాన్నీ ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఆచార్య మూవీ షూట్‌కు సంబంధించిన ఓ వీడియోను చెర్రి అభిమానులతో పంచుకున్నారు. ‘నేను అప్పా అని ప్రేమగా పిలిచే మా ఆచార్యతో గడిపిన ఈ క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను’ అని పేర్కొన్నారు.

ఆచార్య సినిమాలో చరణ్- చిరు ఇద్దరు నక్సలైట్లుగా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఆచార్యలో రామ్ చరణ్ సిద్ద అనే పాత్రలో కనిపించనున్నాడు. చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. చరణ్ సరసన పూజాహెగ్డే కనిపించనుంది. సోనూసూద్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. మణిశర్మ స్వరాలు అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -